మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 19:23:10

కేఎంసీలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయండి

కేఎంసీలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయండి

వరంగల్ అర్బన్ : కేఏంసీలో (కాకతీయ మెడికల్ కాలేజ్)  పీఎంఎస్ వై కింద చేపట్టిన  సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ అసంపూర్తి పనులను వారం రోజుల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పరిశీలించి సమీక్ష నిర్వహించారు. దవాఖానలో బెడ్ లను ఏర్పాటు చేసినందున వాటి పై పరుపులను వేసి పనిని నాలుగు రోజుల్లో  పూర్తి చేయాలన్నారు.

 ఆక్సిజన్ వెంటెలేటర్ల ఏర్పాటు పనులను కూడా సత్వరమే పూర్తి  చేయాలని కేంద్ర ప్రభుత్వ  వైద్య  అరోగ్య మంత్రిత్వ శాఖ కన్సల్టెన్సీ ప్రతినిధి నాగేందర్ రెడ్డిని కోరారు.  భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఇప్పుడే అన్ని పరిశీలన చేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంజీఎం హాస్సిటల్ లో ఫీవర్ వార్డు, పాత సర్జికల్ వార్డు లో అదనంగా 150 బెడ్స్ ఏర్పాటు పనులు తొందరగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

 అందు కోసం అవసరమైతే మైన మెటీరియల్ పెంచి పూర్తి చేయాలని ఏంజిఏం సూపరింటెండ్ ను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్  పమేలా సత్ప తి కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జున రెడ్డి, ఆర్డీవో వాసు చంద్ర,  తహసీల్దార్ కిరణ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.logo