బుధవారం 27 మే 2020
Telangana - May 21, 2020 , 21:05:21

కంగ్టిలో నెలాఖరు వరకు లాక్ డౌన్..గ్రామ పెద్దల తీర్మానం

కంగ్టిలో నెలాఖరు వరకు లాక్ డౌన్..గ్రామ పెద్దల తీర్మానం

సంగారెడ్డి : కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ 4.0లో సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన కంగ్టిలో మాత్రం లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. కర్ణాటకకు 3 కిలోమీటర్లు, మహారాష్ట్రకు 8 కిలోమీటర్లు దూరం ఉండడంతో అక్కడి ప్రాంత ప్రజలు..మన ప్రాంతంలోకి వచ్చే అవకాశం అధికంగా ఉంది.

కంగ్టికి వేరే రాష్ర్టాలకు చెందిన ప్రజలు అధికంగా రావడంతో గ్రామ పెద్దలు గ్రామ సభను నిర్వహించి..నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని తీర్మానించారు. గ్రామ పెద్దల తీర్మానంతో మండల కేంద్రమైన కంగ్టిలో ఎలాంటి వ్యాపార దుకాణాలు తెరుచుకోవడం లేదు. కరోనాను నియంత్రించేందుకు ముందుస్తు చర్యలో భాగంగా ప్రత్యేక తీర్మానం చేసిన సర్పంచ్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo