గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 04, 2020 , 02:00:41

విదేశీ వాణిజ్యానికి పూర్తి స్వేచ్ఛ

విదేశీ వాణిజ్యానికి పూర్తి స్వేచ్ఛ

  • మన పీవీ ఘనతలివీ 

పీవీ నిర్ణయాలన్నీ భారత భవిష్యత్తును బంగారుమయం చేసినవే. దేశాభివృద్ధిని పట్టాలెక్కించడానికి ఆయన చేపట్టిన సం స్కరణలు ముందుచూపుతో ఆలోచించినవే. అందులో వాణిజ్య విధాన సంస్కరణలు ప్రధానమైనవి. విదేశీ వాణిజ్య నిబంధనలను సరళతరం, సులభతరం చేయటంతో ప్రపంచ మార్కెట్‌లో భారత వాణిజ్యానికి మహర్దశ ఏర్పడింది. ఉత్పత్తి, వాణిజ్య సంబంధిత సమస్యలను అధిగమించేందుకు పీవీ ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించింది. అందుకోసం కీలక విధానాలను అవలంబించింది. 1991 జూ లైలో విదేశీ కరెన్సీతో పోల్చి భారత రూపా యి విలువను 18-19 శాతానికి కుదించారు. 51 శాతం ఫారిన్‌ ఈక్విటీతో ట్రేడిం గ్‌హౌజ్‌ల ఏర్పాటుకు అనుమతినిచ్చారు. దీంతో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. వస్తు సేవల తరలింపుపై ఆంక్షలను ఎత్తివేయటం, ఉత్పత్తిదారులే తమ వస్తువులకు ధర నిర్ణయించుకోవటం, వస్తువులను అమ్మే ప్రాంతాలపై ఉన్న ఆంక్షలను తొలగించటం, పన్నురేట్లను తగ్గించటం వంటి సరళీకరణ నిర్ణయాలు తీసుకున్నారు. అనేక వస్తువుల దిగుమతులను ఓపెన్‌ జనరల్‌ లైసెన్స్‌లోకి మార్చారు. 

విదేశీ వాణిజ్యంలో కేవలం 71 వస్తువులపైనే నిషేధం అమల్లో ఉంచారు. తొలిసారిగా 1991-92 బడ్జెట్‌లో 300 శాతం దిగుమతి సుంకాలను 150 శాతానికి తగ్గించారు. అంతేకాదు.. 1993-94లో కరెంట్‌ అకౌంట్‌లో రూపాయి పూర్తి మార్పిడి అమల్లోకి వచ్చింది. దాంతో ప్రభుత్వం కరెంట్‌ అకౌంట్‌కు సంబంధించిన విదేశీ మారకం అమ్మకం, కొనుగోళ్లలో బహిరంగ మార్కెట్‌కు అనుమతి ఇచ్చింది. ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డును స్థాపించి, సింగిల్‌ విండో ద్వారా విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు. అటు.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు క్యాపిటల్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిచ్చారు. దేశంలో విదేశీ బ్యాంకులు స్థాపించేందుకు సౌకర్యాలను కూడా పీవీ ప్రభుత్వం కల్పించింది. ఇలా పీవీ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఎగుమతులు, దిగుమతుల్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి.

తాజావార్తలు


logo