శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 16:18:21

దసరా నాటికి రైతువేదికలు పూర్తి చేయండి : మంత్రి కొప్పుల

దసరా నాటికి రైతువేదికలు పూర్తి చేయండి  : మంత్రి కొప్పుల

కరీంనగర్ : రైతువేదికల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి దసరా నాటికి పూర్తి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం ఆయన సెల్ ఫోన్ ద్వారా రైతువేదికలు, కల్లాల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రైతు వేదికల నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

వాటి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసి దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే, ఇప్పటివరకు మంజూరైన కల్లాలెన్ని, ప్రారంభించిన పనులెన్ని, పనులు మొదలైనవి ఏ స్థాయిలో ఉన్నాయి, వాటిలో ఎన్ని పూర్తయ్యాయి, ఎప్పటిలోగా పూర్తవుతాయని మంత్రి అధికారులను వివరాలు అడిగారు. కల్లాలను కూడా వీలైనంత తొందరలో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 


logo