ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 12:57:48

నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయండి

నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయండి

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ 13వ డివిజన్ నుంచి ఖమ్మం బోనకల్ వరకు అనుసంధాన రోడ్డుపై రూ.74 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న దంసలాపురం ఆర్ఓబీ బ్రిడ్జి నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిధులకు వెనుకాడకుండా పట్టణాల అభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు. నాణ్యత ప్రమాణాలు లోపించకుండా పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే అప్రోచ్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ఫోర్ లైన్ రోడ్డు పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

                        


logo