సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 17:33:52

ఇక ఫోన్ లోనే ప్రజా సమస్యలపై ఫిర్యాదులు..

ఇక ఫోన్ లోనే ప్రజా సమస్యలపై ఫిర్యాదులు..

కొమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా: కరోనా వైరస్ కారణంగా  ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని ఈ నెల 31వరకు రద్దు చేస్తున్నట్లు జిల్లా పాలానాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టరేట్ కు రాకుండా ఉదయం 10.30  నుండి మధ్యాహ్నం 1.00 గంటల  వరకు 08733279403 నంబరు కు  కాల్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు మార్చి 31వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితోపాటు సినిమాహాళ్లు, బార్లు, పబ్బులు, క్లబ్ లు, జిమ్ లు, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు, స్మిమ్మింగ్ పూల్స్, పార్కులు, మ్యూజియంలు మూసివేయాలని నిర్ణయించింది. 


logo