శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:31

సీఎంపై సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు

 సీఎంపై సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు

  • సైబర్‌క్రైం ఠాణాలో టీఆర్‌ఎస్వీ ఫిర్యాదు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై సోషల్‌మీడియాలో తప్పుడుప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ సోమవారం సీసీఎస్‌ సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదుచేశారు.  కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. ఫొటోలు, నకిలీ వార్తలను వెంటనే తొలగించాలని కోరుతూ ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీచేశారు. పోస్టు పెట్టిందెవరనే విషయంపై ఆధారాలు సేకరించారు. తప్పుడు వార్తలు సృష్టించిన వ్యక్తి జగిత్యాలకు చెందిన కల్యాణ్‌గా గుర్తించారు. ఇతడు ఒక జాతీయ పార్టీ కార్యకర్త అని తెలిసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఒక పథకం ప్రకారం ముఖ్యమంత్రిపై తప్పుడువార్తలు సృష్టించి, వాటిని దుబాయ్‌ నుంచి పోస్టు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై సైబర్‌క్రైం పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.logo