శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 26, 2020 , 02:29:44

ఠాణాల్లో ఫిర్యాదుల పెట్టెలు

ఠాణాల్లో ఫిర్యాదుల పెట్టెలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఓ వైపు ప్రజలను కాపాడే విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు వైరస్‌ బారినపడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫిర్యాదుదారుల నుంచి కరోనా సోకుతుండటంతో మధ్యేమార్గంగా నారాయణపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటుచేశారు. చిన్నచిన్న అంశాలకు పోలీస్‌స్టేషన్‌ లోపలకు రావాల్సిన పనిలేకుండానే బాధితులు ఫిర్యాదులను ‘నీ నేస్తం’ పేరిట పెట్టిన బాక్సుల్లో వేస్తే సరిపోతుందని పోలీస్‌ ఉన్నతాధికారులు సూచించారు. బాక్సుల్లోని ఫిర్యాదులను ప్రతి మూడు నాలుగుగంటలకు ఒకసారి పరిశీలిస్తున్నారు. అత్యవసరమైతే డయల్‌ 100కు ఫోన్‌చేయవచ్చని చెప్తున్నారు. పోలీసుల వాట్సాప్‌ నంబర్లు ప్రజలకు తెలిసేలా ప్రదర్శిస్తున్నారు. 


logo