శనివారం 06 జూన్ 2020
Telangana - May 20, 2020 , 20:37:08

నాగబాబుపై పోలీసులకు ఫిర్యాదు

నాగబాబుపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌: మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సేను  దేశభక్తుడిగా సంబోధిస్తూ వ్యాఖ్యలు చేసిన నటుడు నాగబాబుపై కాంగ్రెస్‌ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి విచారణ జరుపాలని కాంగ్రెస్‌ నాయకుడు మానవతారాయ్‌ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డిమాండ్‌ చేశారు. గాడ్సే జయంతి సందర్భంగా మహాత్మగాంధీని అవమానిస్తూ నాగబాబు సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అలాగే ఆయనను హత్య చేసిన నాథూరామ్‌గాడ్సేను దేశభక్తుడిగా సంబోధించారని తన ఫిర్యాదులో  పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించేందుకు సర్వం  ధారబోసిన గాంధీని అవమానిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన నాగబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని మానవతారాయ్‌ డిమాండ్‌ చేశారు.


logo