సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 01:50:05

మానవ అక్రమ రవాణాపై ఫిర్యాదుచేయండి: డీజీపీ

మానవ అక్రమ రవాణాపై ఫిర్యాదుచేయండి: డీజీపీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మానవ అక్రమ రవాణాపై సమాచారం తెలిస్తే వెంటనే డయల్‌ 100కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ప్రజలను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘మానవ అక్రమ రవాణా గురించిన ఎలాంటి సమాచారం మీ వద్ద ఉన్నా.. డయల్‌ 100 ద్వారా మాకు తెలియజేయండి. సంకోచించకండి. వారి (బాధితుల) మాన-ప్రాణాలు కాపాడేందుకు మిగిలి ఉన్న ఒకే ఒక్క అవకాశం మీరే కావొచ్చు’ అని పేర్కొన్నారు. మహిళా భద్రత విభాగం వివరాలను కూడా ట్విట్టర్‌లో షేర్‌చేశారు.

పెండింగ్‌ కేసులపై దృష్టిపెట్టండి

రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తన కార్యాలయం నుంచి పోలీస్‌ కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలతో పెండింగ్‌ కేసుల అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. క్రైంరేట్‌ తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీఐడీ అడిషనల్‌ డీజీ గోవింద్‌సింగ్‌, నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


logo