శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 15, 2020 , 13:50:39

భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం: మంత్రి అల్లోల

భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం: మంత్రి అల్లోల

నిర్మల్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27, 28 కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్యాకేజీ 28 ద్వారా నష్టపోయిన మొత్తం 113 మంది రైతులకు రూ.8.12కోట్ల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్యాకేజీ 27, 28 పనులు పూర్తయితే నిర్మల్‌ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. వీలైనంత తొందరగా కాలువల నిర్మాణం పూర్తిచేసి ప్రతి రైతుకు నీరందించేందుకు కృషిచేస్తానన్నారు. కరోనా వైరస్‌ వల్ల ఆర్థికంగా ఎన్ని ఇంబ్బందులు ఎదురైనా రైతులకు చేయూతనందించడానికి సీఎం కేసీఆర్‌ వెనుకంజవేయడం లేదని తెలిపారు. రైతు రుణమాఫీ, వానాకాలం సాగుకు రైతుబంధు కోసం రూ.8120 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు లైన్లలో నిలబడేవారని, తెలంగాణ రాష్ట్రం వచ్చినతర్వాత ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని రైతులు సకాలంలో పంటలు వేసుకోవాలని సూచించారు.


logo