శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 01:32:13

సాదామహిళల భద్రతకు పెద్దపీట: సీఎస్‌

సాదామహిళల భద్రతకు పెద్దపీట: సీఎస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహిళలు, బాలికల భద్రత, రక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు మహిళా సివిల్‌ సర్వీసెస్‌ అధికారులతో ఏర్పాటైన మహిళలు, బాలికల భద్రత, రక్షణ కమిటీ సమావేశం మంగళవారం బీఆర్కేభవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్‌ యోగితారాణా, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, మహిళాశిశు సంక్షేమశాఖ  కమిషనర్‌ దివ్య, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, డీసీపీ సుమతి హాజరయ్యారు. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా మహిళా అధికారులు చర్చించారు. ముఖ్యంగా పని ప్రదేశాల్లో, ఇండ్లు, రవాణా సమయంలో మహిళల భద్రత, లైంగిక వేధింపుల నివారణ అంశాలపై దృష్టి సారించడానికి సబ్‌కమిటీలు ఏర్పాటుచేయాలని సీఎస్‌ను కోరారు. మహిళాఅధికారుల సూచనలను అంగీకరించిన సీఎస్‌.. తగిన ప్రతిపాదనలతో రావాలన్నారు.