e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home తెలంగాణ సవ్యంగానే మల్లన్నసాగర్‌ పనితీరు

సవ్యంగానే మల్లన్నసాగర్‌ పనితీరు

  • తేల్చిచెప్పిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ: ఈఎన్సీ హరిరాం వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రాష్ట్రంలోని అతిపెద్ద మానవనిర్మిత జలాశయం మల్లన్నసాగర్‌పై ఐఐటీ హైదరాబాద్‌, ఓయూ ప్రొఫెసర్లతో కూడిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ ప్రశంసలు కురిపించిందని ఈఎన్సీ హరిరామ్‌ తెలిపారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌, గజ్వేల్‌ ఈఎన్సీ హరిరామ్‌తో పాటు ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్లు ఉమాశంకర్‌, శశిధర్‌, ఓయూ ప్రొఫెసర్‌ శ్రీధర్‌ సభ్యులుగా నియమించిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ మల్లన్నసాగర్‌ను ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కట్ట పనితీరు, డ్రెయిన్‌ సిస్టమ్‌ అంతా సవ్యంగానే ఉందని ధ్రువీకరించారు. ట్రయల్న్‌న్రు ఇంకా కొనసాగించాలని, మొదటి విడతగా రిజర్వాయర్‌ను మినిమల్‌ డ్రా డౌన్‌ లెవల్‌ (ఎండీడీఎల్‌) వరకు నెమ్మది నెమ్మదిగా నింపాలని సూచించారు. ఈ బృందంతో పాటు చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌, ఎస్‌ఈ వేణు, తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement