శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 19:14:29

పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై కమిటీ భేటీ

పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై కమిటీ భేటీ

హైదరాబాద్‌ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణపై ఎంపీ కేకే ఆధ్వర్యంలోని కమిటీ గురువారం సమావేశమైంది. భేటీకి మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, పీవీ కుటుంబ సభ్యులు, తదితరులు హాజరయ్యారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఉత్సవాల నిర్వహణ, కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు కేకే తెలిపారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.logo