శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 00:53:38

ఏసీబీ వలలో వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు

ఏసీబీ వలలో వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు

కరీమాబాద్‌: జీఎస్టీ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు లంచం తీసుకొంటూ ఇద్దరు వరంగల్‌ డివిజిన్‌ వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. జనగామ సర్కిల్‌ డీసీటీవోగా పని చేస్తున్న జ్యోతి వరంగల్‌ అర్బన్‌-3 ఇన్‌చార్జి సీటీవోగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్‌ యాకయ్య జీఎస్టీ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కోసం జ్యోతిని సంప్రదించాడు. ఇందుకోసం జ్యోతి రూ.5వేలు లంచం డిమాండ్‌చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి రూ.2వేలు లంచం తీసుకుంటుండగా జ్యోతితోపాటు సీనియర్‌ అసిస్టెంట్‌ రయీష్‌పాషాను పట్టుకున్నారు. 


logo