శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 13:25:48

వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం

వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం

నల్లగొండ : అప్పు చేయకుండా రైతులు వ్యవసాయం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారని, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మర్రిగూడెం, నాంపల్లి, చండూర్, మునుగోడు మండల కేంద్రాల్లో రైతువేదిక భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా సాగులో సమూల మార్పులు తీసుకువచ్చి  వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని జగదీష్ రెడ్డి అన్నారు.

 రైతులకు పుష్కలంగా నీళ్లు, 24 గంటల ఉచిత కరంట్, ఎకరానికి 10 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తూనే.. గిట్టుబాటు ధర కూడా రైతులకు అందిస్తూ కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. రైతులకు బహుళ ప్రయోజనాలు కల్పించే  రైతు వేదికల నిర్మాణాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో దసరా లోపు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. 

గత పాలకులు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసారని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో  తెలంగాణ లో నేడు వ్యవసాయం పండుగలా మారిందని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రాంచంద్రనాయక్, టీఆర్ఎస్  నాయకులు కర్నాటి  విద్యాసాగర్, నారాబోయిన రవి  స్వరూప, స్థానిక ఎంపీపీలు, జడ్పిటిసీ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.logo