శ్రీశైలం ఐదవ యూనిట్లో విద్యుదుత్పత్తి ప్రారంభం

శ్రీశైలం : శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలోని ఐదో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మరమ్మతు పనులు పూర్తి కావడంతో విద్యుదుత్పత్తిని మొదలెట్టినట్లు చీఫ్ ఇంజనీర్ మేక ప్రభాకర్‌రావు తెలిపారు. గురువారం మధ్యాహ్నం ప్లాంట్ అధికారులు ఇంజినీర్ల సమక్షంలో విద్యుదుత్పత్తి ప్రారంభించి.. హైడల్పవర్ను గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానించారు. ప్లాంట్‌లోని ఆరు యూనిట్లలో అక్టోబర్ నెలాఖరున 1,2 వ యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన తరువాత.. 5 వ యూనిట్ పనులు వేగవంతం చేసి సాంకేతిక ప్రమాణాల నిర్ధారణ అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పవర్ జనరేషన్ చేస్తున్నట్లు సీఈ తెలిపారు. అదేవిధంగా 3,6, 4 వ యూనిట్లలో పనులు వేగవంతం చేసి త్వరలో యథావిధిగా అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు తరలించే దిశగా ప్రణాళికలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తి జరుగుతున్న యూనిట్లలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఇంజనీరింగ్ విభాగం తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.