శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 08:34:11

ఉదయభాను చాలెంజ్‌ను స్వీకరించిన బ్రహ్మానందం

ఉదయభాను చాలెంజ్‌ను స్వీకరించిన బ్రహ్మానందం

హైదరాబాద్‌: ప్రముఖ యాంకర్‌, నటి ఉదయభాను విసిరిన చాలెంజ్‌ను హాస్యనటుడు బ్రహ్మానందం స్వీకరించారు. ఈ రోజు ఉదయం తన నివాసంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మూడో విడుతలో భాగంగా గత ఆదివారం ఉదయభాను మొక్కలు నాటారు. అనంతరం సీనియర్‌ నటుడు బ్రహ్మానందానికి చాలెంజ్‌ విసిరారు. దీన్ని స్వీకరించిన ఆయన తన ఇంట్లో మొక్కలు నాటారు. 

తాను ఇచ్చిన సవాల్‌ స్వీకరించిన బ్రహ్మానందానికి ఉదయభాను కృతజ్ఞతలు తెలిపారు. సృష్టిని కాపాడేందుకు ఒక్క చెట్టు మాత్రమే ఒంటికాలిపై తపస్సు చేస్తున్నదని అన్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, అందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.logo