శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 00:36:45

రూ.1,350 కోట్లతో రండి

రూ.1,350 కోట్లతో రండి

వరదలా వస్తున్నారు.. వరద సాయం తెస్తున్నారా: మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి వస్తున్న కేంద్ర మంత్రులు ఉత్త చేతులతో రాకుండా.. సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసినట్టు వరదబాధితుల సహాయార్థం రూ.1,350 కోట్లు తీసుకొస్తారని ఆశిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి వరుసగా వస్తున్న కేంద్ర మంత్రులను దృష్టిలో పెట్టుకొని బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. వరదలాగా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్ర మంత్రులందరికీ హైదరాబాద్‌కు స్వాగతమని తెలిపారు. ఇదేదో నగరం అకాలవర్షాల కారణంగా వరదలతో తల్లడిల్లుతున్నప్పుడు సాంత్వన చేకూర్చడానికి వస్తే బాగుండేదని ఆయన చురకలంటించారు.logo