ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 21:19:04

వైద్య పరీక్షలు చేయించుకున్నాకే గ్రామానికి రండి

వైద్య పరీక్షలు చేయించుకున్నాకే గ్రామానికి రండి

నవాబ్‌పేట : కరోనా వైరస్‌ రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అటు ప్రజలు, ఇటు ప్రజాప్రతినిధులు సైతం అలర్ట్‌ అయ్యారు.  మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కల్మన్‌కల్వ గ్రామంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎన్‌ఎం, మహిళా సంఘం సభ్యులతో కలిసి వినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి కుటుంబ సభ్యులకు వైద్య, ఆరోగ్యశాఖ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.

 ఈ సందర్భంగానే సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామం నుంచి సుమారుగా 150 నుంచి 200 మంది వివిధ కారణాలతో ముంబయి, పూణె, హైదరాబాద్‌ వంటి నగరాలకు జీవనోపాధికోసం వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం వారు ఉగాది పండుగ కోసం గ్రామానికి వచ్చే అవకాశం ఉందని, అందుకే ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకొని గ్రామానికి రావాలని ఆయన సూచించారు.logo