శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 17:11:02

వరంగల్‌ అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌

వరంగల్‌ అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌

వరంగల్‌ : మావోయిస్టుల కదలికల సమాచారంతో వరంగల్‌ అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీసులు సంయుక్తంగా అటవీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల స్థానిక ప్రజాప్రతినిధులకు పోలీసు అధికారులు భద్రతను పెంచారు. భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళం సంచరిస్తున్నట్లుగా అధికారుల సమాచారం. కొత్తగూడెంలో ఇటీవల చేపట్టిన కూంబింగ్‌ ఆపరేషన్‌లో దళ సభ్యులు పోలీసుల నుంచి తప్పించుకుపోయారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవు. మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా కొనసాగుతూనే ఉంది. నిరంతరాయంగా కొనసాగుతున్న తనిఖీలతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణలోకి మావోయిస్టుల ప్రవేశాన్ని విజయవంతంగా నిలువరించారు. ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో మావోయిస్టు కిందిస్థాయి కేడర్‌ను పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్‌ చేస్తున్నారు.


logo