గురువారం 09 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 09:34:46

సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర

సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర

సూర్యాపేట: భారత్‌, చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలను  సైనిక అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. ఆర్మీ అధికారులు, మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌  తదితర జిల్లా అధికారులు  సంతోష్‌బాబు  పార్థివదేహం ముందు పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు వీర జవాన్‌ తల్లిదండ్రులు, భార్య  సంప్రదాయ ప్రకారం సంతోష్‌బాబు నోటిలో తులసి నీళ్లు పోశారు. 

 అంతిమయాత్రలో పాల్గొన్న వారు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. కేసారం వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న  అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులకు మొత్తం 50 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. చివరిసారిగా కల్నల్‌  పార్థివదేహాన్ని చూసేందుకు సూర్యాపేట వాసులు తరలివచ్చారు. 

logo