శనివారం 11 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 10:37:13

కల్నల్‌ సంతోష్‌బాబు అస్తికల నిమజ్జనం

కల్నల్‌ సంతోష్‌బాబు అస్తికల నిమజ్జనం

నల్గొండ:  లడఖ్‌ గాల్వన్ లోయలో చైనా సైన్యంతో ఘర్షణలో  వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు  అస్తికలను ఆయన కుటుంబ సభ్యులు శనివారం నిమజ్జనం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా,  మూసి నదుల సంగమంలో తండ్రి  ఉపేందర్‌, భార్య సంతోషి, కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. 

ఈ సందర్భంగా సంతో‌ష్‌ బాబు కుటుంబసభ్యులు వెళ్తున్న  వాహనం దామరచర్ల గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు ఆ    వాహనంపై పూలు చల్లారు.  కల్నల్‌ సంతోష్‌బాబు అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు.logo