ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 12:53:07

కల్నల్‌ సంతోష్‌ బాబు అంత్యక్రియలు రేపు

కల్నల్‌ సంతోష్‌ బాబు అంత్యక్రియలు రేపు

హైదరాబాద్‌ : చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. సూర్యాపేట మండలం కసరాబాద్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను ఆర్మీ అధికారులు, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ పర్యవేక్షిస్తున్నారు.

కల్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో రాష్ర్టానికి తరలించనున్నారు. బుధవారం సాయంత్రం 4:30 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి సంతోష్‌ భౌతికకాయం చేరుకోనుంది. అక్కడ సంతోష్‌ పార్థివదేహానికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, రాష్ట్ర మంత్రులు నివాళులర్పించనున్నారు. అనంతరం సాయంత్రం 6గంటలకు రోడ్డుమార్గంలో సూర్యాపేటకు కల్నల్‌ భౌతికకాయాన్ని తరలించనున్నారు. logo