సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 02:51:50

‘ఐ ఫీల్‌ వెరీ ప్రౌడ్‌ ఆఫ్‌ మై డాడ్‌'

‘ఐ ఫీల్‌ వెరీ ప్రౌడ్‌ ఆఫ్‌ మై డాడ్‌'

  • బాధేస్తుంది.. అయినా గర్వంగా ఉన్నది
  • ఏ ప్రాబ్లంవచ్చినా ఏడ్వద్దని నాన్న చెప్పాడు
  • మీడియాతో సంతోష్‌బాబు కూతురు అభిజ్ఞ
  • అత్తమామలకు ధైర్యం చెప్పిన భార్య సంతోషి

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : ‘మా డాడీ కర్నల్‌ సంతోష్‌బాబు వెరీడేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ పర్సన్‌.. ఐ ఫీల్‌ వెరీ ప్రౌడ్‌ ఆఫ్‌ మై డాడ్‌.. లఢక్‌ వద్ద చైనా సోల్జర్స్‌తో ఫైట్‌చేస్తూ లేక్‌లో పడి చనిపోయినట్టు చెప్పారు. మా మమ్మీ, నేను చాలా ఏడ్చాం. విపరీతమైన బాధేస్తున్నది.. ఏ సమస్య వచ్చినా ఏడ్వద్దని నాన్న చెప్పేవారు. అందుకే కంట్రోల్‌ చేసుకుంటు న్నాం. పైగా ఎక్కడ చూసినా నాన్న ఫొటోలు కనిపిస్తున్నాయి. 

మీడియాలో నాన్న గురించే చెప్తున్నారు. గర్వంగా కూడా ఉన్నది’ అంటూ సంతోష్‌బాబు కూతురు అభిజ్ఞ చెప్పింది. ఎనిమిదేండ్ల చిన్నారి మీడియాతో ఆర్మీ ఆఫీసర్‌ కూతురులా ధైర్యంగా మాట్లాడింది. ‘లఢక్‌లో ఉండటంతో రోజు తప్పించి రోజు మాతో వీడియోకాల్‌ ద్వారా మాట్లాడేవారు. బిజీగా ఉంటే రేపు కాల్‌చేస్తానని చెపితే ఫోన్‌కోసం ఎదురుచూసేవాళ్లం’ అని తెలిపింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన మనుమరాలు, మనుమడిని పట్టుకుని రోదిస్తున్న తన తల్లిదండ్రులు, అత్తమామలకు  కర్నల్‌ సతీమణి సంతోషి ధైర్యం చెప్పారు. ‘నథింగ్‌ హ్యాపెండ్‌.. డోంట్‌ వర్రీ.. అయామ్‌ హియర్‌ విత్‌ టూ చిల్డ్రన్స్‌..’ అని పేర్కొన్నారు.


logo