శనివారం 04 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 00:01:38

సూర్యపేటకు చేరుకున్న సంతోష్‌ బాబు పార్థివదేహం

సూర్యపేటకు చేరుకున్న సంతోష్‌ బాబు పార్థివదేహం

సూర్యపేట: భారత్‌ - చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థీవ దేహం సూర్యపేటలోని ఆయన స్వగృహానికి చేరుకుంది. హకీంపేట విమానాశ్రయం నుంచి సూర్యపేటకు ప్రత్యేక వాహనంలో తరలించారు. హైదరాబాద్‌ నుంచి సూర్యపేట వరకు రహదారి పొడుగునా ప్రతి గ్రామంలో, టోల్‌ గేట్ల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున చేరి సంతోష్‌ బాబు పార్థివదేహం తరలిస్తున్న వాహనంపై పూలు చల్లి, భారత్‌ మాతాకు జై, సంతోష్‌ అమర్హ్రే అంటూ నినాదాలు చేస్తూ నివాళులర్పించారు. కల్నల్‌ సంతోష్‌ బాబు నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లా కలెక్టర్‌తో సహా పలువురు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. సంతోష్‌బాబు వ్యవసాయ క్షేత్రంలో రేపు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. మిలటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 


logo