ఆదివారం 24 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 14:24:17

గడువులోగా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

గడువులోగా కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి

సిద్దిపేట : త్వరలో  ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ నెల 29వ తేదీలోపు కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని దుద్దెడ గ్రామ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ లో అసంపూర్తిగా మిగిలిన నిర్మాణ పనులను గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పలువురు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి ప్రారంభోత్సవ ఏర్పాట్ల పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి సర్వం సిద్ధం చేయాలని ఆదేశించారు. 

ఈ నెల 29వ తేదీలోపు కలెక్టరేట్ కార్యాలయంలో శాఖల వారీగా ఫర్నీచర్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్అండ్ బీ ఈఈ సుదర్శన్ ను కలెక్టర్ ఆదేశించారు.  కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు పద్మాకర్,ముజమ్మీల్ ఖాన్, గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి,  కొండపాక తహశీల్దార్ రామేశ్వర్, ఆర్అండ్ బీ శాఖ డీఈ వెంకటేశ్వర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇతర అధికారిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo