మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 12:09:31

ఆక్సిజన్ లిక్విడ్ ప్లాంట్ ను పరిశీలించిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్

ఆక్సిజన్ లిక్విడ్ ప్లాంట్ ను పరిశీలించిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్

ఖమ్మం : ఖమ్మం నగరంలోని ప్రభుత్వ దవాఖానలో నిర్మించనున్న ఆక్సిజన్ లిక్విడ్ ప్లాంటును కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ గురువారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు అవసరమైన ఆధునిక పరికరాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈ దవాఖానలో ఐసోలేషన్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వైద్యులను నిరంతరం అందుబాటులో ఉంచినట్లు వివరించారు. దవాఖానలో మాత శిశు సంక్షేమ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆధునిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. 


logo