శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 11:40:17

క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హరిత

క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హరిత

వరంగల్ రూరల్ జిల్లా: జిల్లాలోని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఎస్టీ వసతి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన 35 పడకల  క్వారంటైన్ కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ హరిత పరిశీలించారు. కలెక్టర్ తోపాటు ఆర్డీవో మహేందర్ జీ, ఏసిపి రమేష్ క్వారంటైన్ కేంద్రాల్లో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

భూపాలపల్లిలో ప్రజల అవసరాల దృష్ట్యా సంత ఏర్పాటును అదనపు కలెక్టర్ రాజా విక్రమ్ రెడ్డి పరిశీలించారు. ప్రజలు గుమిగూడకుండా ఒకే చోట కాకుండా హనుమాన్ టెంపుల్, కృష్ణ కాలనీ, బస్ డిపో, సుభాష్ కాలనీ రామాలయం వద్ద నాలుగు చోట్ల సంత ఏర్పాటు చేయాలని రాజా విక్రమ్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. logo