మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 16:42:27

సమిష్టిగా హరితహారాన్ని విజయవంతం చేయాలి

సమిష్టిగా హరితహారాన్ని విజయవంతం చేయాలి

వరంగల్ : సీఎం కేసీఆర్ నిర్ణయించిన లక్ష్యాలు సాధించి నూటికి నూరు శాతం మొక్కలు మనుగడ సాధించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆరో విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, వివిధ శాఖలకు అనుసంధానం చేసిన ఉపాధి హామీ పథకాల అమలు, కల్లాల నిర్మాణం వంటి పలు అంశాలపై గిరిజన

సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేస్తూ, అన్ని పనులు జరిగేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.


logo