ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 14:02:35

కరోనా సోకినవారికి మానవత్వంతో సహకరించండి

కరోనా సోకినవారికి మానవత్వంతో సహకరించండి

పెద్దపల్లి : కరోనా పాజిటివ్  అంటే ప్రజలు భయపడవద్దని, కరోనా సోకిన వారితో మానవత్వంతో ప్రజలు సహకరించాలని జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో  కరోనా సోకిన వారి పట్ల ప్రతి ఒక్కరు భయపడకుండా మానవత్వంతో మెలగాలన్నారు. ఒక మనిషికి మరో మనిషి సహాయం చేసేలా సహకరించాలని సూచించారు.

 కరోనా అంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారని, కరోనా సోకిన వారు దూరంగా ఉంటూ వారిని హీనంగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ తో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా అందకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కరోనా వ్యాధి సోకిన వారి పట్ల మానవత్వంతో ఆలోచించి వారికి చేతనైన సాయం చేయాలన్నారు. 

మంథని నియోజక వర్గంలో కరోనా వైరస్ తో మృతి చెందిన వారికి పుట్ట లింగమా ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. మంథనిలో ఇటీవల ఓక యువకునితోపాటు మరికొంత మంది చనిపోయారని వారి కుటుంబ సభ్యులు కూడా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడం తనను బాగా కలిచివేసిందన్నారు. ఇక నుంచి కరోనా వైరస్ తో మృతి చెందిన మృతదేహాలకు పుట్ట లింగమా ట్రస్ట్ ఆధ్వర్యంలోనే అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుతామన్నారు. ఆయన వెంట ఎంపీపీ రాజిరెడ్డి. వైస్ ఎంపీపీ సుదారి రవీందర్ రావు సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.logo