శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 06:22:27

రాష్ట్రాన్ని వ‌ణికిస్తున్న చ‌లి

రాష్ట్రాన్ని వ‌ణికిస్తున్న చ‌లి

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్ర‌త‌లు అంత‌కంత‌కు ప‌డిపోతున్నాయి. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా చలి వణి‌కి‌స్తు‌న్నది. రాష్ట్రంలో నిన్న‌ అత్యల్పంగా కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌ జిల్లా‌లోని తిర్యాణి మం డలం గిన్నె‌ధరి గ్రామంలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్ర‌త నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌ జిల్లా‌లోని భీంపూర్‌ మండలం అర్లి(‌టీ)లో 8 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా‌లోని కుభీ‌ర్‌లో 8.9 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం కాస్లాబాద్‌లో 9.4, మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం భాగ్యనగర్‌ నందనవనం ప్రాంతంలో 9.8 డిగ్రీలు, మంచి‌ర్యాల జిల్లా‌లోని జన్నా‌రంలో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ‌త్రలు నమో‌ద‌య్యాయి. 

రాష్ట్రం‌లోని ఉమ్మడి పది జిల్లాల్లో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు సాధా‌ర‌ణంగా కంటే మూడు, నాలుగు డిగ్రీలు తగ్గి‌నట్టు వాతా‌వ‌ర‌ణ‌శాఖ అధి‌కా‌రులు తెలి‌పారు. రాష్ట్రంలో మరో రెండు రోజులు పొడి‌వా‌తా‌వ‌రణ ఉంటుం‌దని పేర్కొ‌న్నారు. శీతా‌కాలం ప్రారంభం నుంచే ఉష్ణో‌గ్ర‌తలు పడి‌పో‌తుం‌డటం ప్రజల్లో భయాం‌దో‌ళన కలి‌గి‌స్తు‌న్నది. పగటి ఉష్ణో‌గ్ర‌తలు సాధా‌ర‌ణంగా ఉన్న‌ప్ప‌టికీ, రాత్రి వేళల్లో గజ‌గజ వణి‌కి‌స్తు‌న్నది.