శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 16, 2021 , 07:47:47

రాష్ట్రంలో చలి గాలులు

రాష్ట్రంలో చలి గాలులు

హైదరాబాద్ : తుర్పూ, ఈశాన్య దిశ నుంచి రాష్ట్రంలో చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు కురుస్తున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలోని అర్లి(టీ)లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. మరోవైపు, హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగింది. రాత్రి వేళల్లో చలి తీవ్రత కొనసాగుతున్నది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రత 17.6 డిగ్రీలుగా రికార్డయిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

VIDEOS

logo