ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 07:47:58

రాష్ర్టంలో తగ్గు‌తున్న చలి తీవ్రత

రాష్ర్టంలో తగ్గు‌తున్న చలి తీవ్రత

హై‌ద‌రా‌బా‌ద్‌/‌సి‌టీ‌బ్యూరో, జన‌వరి 25 (న‌మస్తే తెలం‌గాణ): రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. ఉష్ణో‌గ్ర‌తలు క్రమంగా పెరు‌గు‌తు‌న్నాయి. దక్షిణ, ఆగ్రేయ దిశ‌ల‌నుంచి గాలులు వీస్తు‌న్నాయి. ఫలి‌తంగా రాష్ట్రంలో పొడి వాతా‌వ‌రణం ఏర్ప‌డింది. సోమ‌వారం కని‌ష్ఠంగా సంగా‌రెడ్డి జిల్లా కోహి‌ర్‌లో 13.3 డిగ్రీలు, భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా సీతా‌రాం‌ప‌ట్నంలో 35.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత రికా‌ర్డ‌య్యాయి. జీహె‌చ్‌‌ఎంసీ పరి‌ధిలో కని‌ష్ఠంగా రాజేం‌ద్ర‌న‌గ‌ర్‌లో 14.7 డిగ్రీలు, బీహె‌చ్‌‌ఈ‌ఎ‌ల్‌లో 34.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌ద‌య్యింది. మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు 14 నుంచి 17, గరిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య నమో‌దయ్యే అవ‌కాశం ఉన్న‌దని తెలం‌గాణ రాష్ట్ర ప్రణా‌ళిక అభి‌వృద్ధి మండ‌లి(‌టీ‌ఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్‌) తెలి‌పింది.

VIDEOS

logo