మంగళవారం 09 మార్చి 2021
Telangana - Jan 21, 2021 , 07:49:53

రాష్ర్టంలో తగ్గిన చలి తీవ్రత

రాష్ర్టంలో తగ్గిన చలి తీవ్రత

హైద‌రా‌బాద్‌, జన‌వరి 20 (న‌మస్తే తెలం‌గాణ): రాష్ట్రంలో రాగల రెండు మూడు రోజుల వరకు పొడి‌వా‌త‌వ‌రణం ఉంటుం‌దని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం వివ‌రిం‌చింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తు‌న్నా‌యని, వీటి ప్రభా‌వంతో ఒకటి పలుచోట్ల తేలి‌క‌పాటి పొగ‌మంచు ఏర్ప‌డు‌తుం‌దని పేర్కొ‌న్నది. సంక్రాంతి పండుగ తర్వాత ఉష్ణో‌గ్ర‌తలు పెరి‌గా‌యని ఈక్ర‌మంలో చలి తీవ్రత తగ్గిం‌దని తెలి‌పింది. బుధ‌వారం అత్య‌ల్పంగా సంగా‌రెడ్డి జిల్లా కోహి‌ర్‌లో 11.3 డిగ్రీలు, అత్య‌ధి‌కంగా భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా సత్య‌నా‌రా‌య‌ణ‌పు‌రంలో 36 డిగ్రీల ఉష్ణో‌గ్ర‌త రికా‌ర్డ‌య్యిం‌దని తెలం‌గాణ రాష్ట్ర అభి‌వృద్ధి ప్రణా‌ళిక సొసైటీ వివ‌రిం‌చింది. హైద‌రా‌బా‌ద్‌లో గరిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు సాధా‌రణం కంటే పెరు‌గు‌తుం‌డ‌టంతో ఎండ తీవ్రత క్రమంగా పెరు‌గు‌తు‌న్నది. రాత్రి ఉష్ణో‌గ్ర‌తలు సాధా‌రణం కంటే తగ్గ‌డంతో రాత్రి, తెల్ల‌వా‌రు‌జాము సమ‌యంలో చలి వణి‌కి‌స్తు‌న్నది.

VIDEOS

logo