మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 12:08:48

ఆదిలాబాద్‌ను వణికిస్తున్న చలి

ఆదిలాబాద్‌ను వణికిస్తున్న చలి

ఆదిలాబాద్ : జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో పొద్దున జనం బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. జిల్లాలో సగటు 5.7 కనిష్ఠ ఉష్ణోగ్రతగా నమోదైంది. భీంపూర్ మండలం ఆర్లీ (టీ) లో 3.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. తగ్గిన ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రాబోయే రెండు రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.