బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 08:33:27

హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గిన చలి

హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గిన చలి

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చలితీవ్రత స్వల్పంగా తగ్గింది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి దగ్గరగా నమోదయ్యాయి. రాగల మరో రెండు మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నగరంలో బుధవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 17.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైందని వెల్లడించారు. సాధారణంగా జనవరి మాసంలో సంక్రాంతి పండుగ సమయానికి చలి తీవ్రత అధికంగా ఉంటుందని అయితే ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉన్నదని పేర్కొన్నారు. తెల్లవారుజాము వేళల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు నగరంలో పలు ప్రాంతాల్లో కూడా పొగమంచు కమ్ముకుంటున్నది. 


logo