గురువారం 09 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 00:57:43

వరదలో కొట్టుకుపోయిన కాఫర్‌ డ్యాం

వరదలో కొట్టుకుపోయిన కాఫర్‌ డ్యాం

కన్నాయిగూడెం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలోకి వరద నీరు భారీగా చేరుతున్నది. దీంతో సమ్మక్క బరాజ్‌ వద్ద పనుల కోసం ఏర్పా టు చేసిన కాఫర్‌ డ్యాం కొట్టుకుపోయింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న సమ్మక్క బరాజ్‌లోకి మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా గోదావరి ఉధృతి పెరిగింది. 75.5 మీటర్ల ఎత్తుకు నీరు చేరడంతో అడ్డుగా ఉన్న కాఫర్‌ డ్యాం తెగిపోయింది. 1 నుంచి 5వ నంబర్‌ వరకు ఉన్న పిల్లర్లు నీటమునగగా, అక్కడ ఉన్న స్టీల్‌, విద్యుత్‌ మోటర్లు, రెండు ఆఫీస్‌ కంటెయినర్లతోపాటు పరికరాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి.


logo