సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 08:23:43

సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఆదిలాబాద్‌ : జనతా కర్ఫ్యూ కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సకలం బంద్‌ అయింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌ పాటిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు సంఘీభావం ప్రకటించాయి. 619 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహారాష్ట్ర నుంచి వాహనాలు రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో  చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తామార్‌, పిప్పరవాడ, తలమడుగు మండలం కుచులాపూర్‌ వద్ద, కుమురంభీం జిల్లా వాంకిడి వద్ద అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా జనతా కర్ఫ్యూ కారణంగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అత్యవసర సేవలు మినహా గని కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు.


logo