e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News భారీ వ‌ర్షాల‌తో రామ‌గుండంలో నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి

భారీ వ‌ర్షాల‌తో రామ‌గుండంలో నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి

భారీ వ‌ర్షాల‌తో రామ‌గుండంలో నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి

పెద్దపల్లి: జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో రామగుండం రీజీయన్‌లో బొగ్గు ఉత్ప‌త్తి నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నాలుగు ఓపెన్ కాస్టు గ‌నులు ఉన్నాయి. వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో నీరు నిలిచింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంత‌రాయం ఏర్ప‌డింది. రోజుకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది.

హైద‌రాబాద్‌లో ఇవాళ ఉద‌యం నుంచి వర్షం కురుస్తున్నది. మియాపూర్‌, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, వనస్థలిపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, యూసఫ్‎గూడ, కృష్ణానగర్, పంజాగుట్ట, కూకట్‎పల్లి, జీడిమెట్లతో పాటు పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వ‌ర్షాల‌కు రోడ్లన్నీ జలమయమయ్యాయి.

స్థిరంగా కొన‌సాగుతున్న‌ అల్ప పీడ‌నం

- Advertisement -

వాయ‌వ్వ బంగాలాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం స్థిరంగా కొన‌సాగుతున్న‌ది. దీనికి అనుబంధంగా ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం మ‌ధ్య ట్రోపోస్పియ‌ర్ స్థాయివ‌ర‌కు వ్యాపించింది. ఇది రానున్న రెండు మూడు రోజుల్లో మ‌రింత బ‌ల‌ప‌డి ప‌శ్చిమ వాయ‌వ్య‌దిశ‌గా ఒడిశా, జార్ఖండ్‌, ఉత్త‌ర ఛ‌త్తీస్‌గ‌ఢ్ మీదుగా వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. దీంతోరాష్ట్రంలో ఉరుములు, మెరుపుల‌తోపాటు గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ సోమ‌, మంగళ‌వారాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని హెచ్చ‌రించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భారీ వ‌ర్షాల‌తో రామ‌గుండంలో నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి
భారీ వ‌ర్షాల‌తో రామ‌గుండంలో నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి
భారీ వ‌ర్షాల‌తో రామ‌గుండంలో నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి

ట్రెండింగ్‌

Advertisement