బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 02:02:14

వ్యాపారులకూ సహకార బ్యాంకుల చేయూత

వ్యాపారులకూ సహకార బ్యాంకుల చేయూత

  • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

మహబూబ్‌నగర్‌:వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించేందుకు సహకార బ్యాంకులు రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకు ద్వారా 45 మంది చిరువ్యాపారులకు రూ.50 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారులు ఇష్టానుసారంగా పేదలపై వడ్డీ భారం మోపుతున్నారని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో డీసీసీబీలో రూ.కోట్ల అవినీతి జరిగిందనీ, కమిటీ సభ్యులు బాధ్యుల నుంచి రికవరీ చేయాల్సి ఉన్నదని చెప్పారు. వ్యవసాయదారులతోపాటు వ్యాపారులకూ డీసీసీబీ చేయూతనిచ్చేందుకు ముందుంటుందన్నారు.  


logo