శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 21:05:42

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు సహకరించాలి: సీఎం

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు సహకరించాలి: సీఎం

హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు సహకరించాలనీ, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ఐకేపీ సెంటర్లు, పీఏసీఎస్‌లు, మార్కెట్‌ కమిటీల ద్వారా గ్రామస్థాయిలోనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. 

లక్ష టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఎఫ్‌ సీ ఐ సిద్దంగా ఉందని అన్నారు. సోమవారం అత్యవసర సమీక్ష నిర్వహించి, అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్‌.. సీఎస్‌ సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు. 


logo