శనివారం 30 మే 2020
Telangana - Feb 15, 2020 , 00:19:33

వ్యాగన్‌ఆర్‌లో సీఎన్‌జీ

వ్యాగన్‌ఆర్‌లో సీఎన్‌జీ
  • ప్రారంభ ధర రూ.5.25 లక్షలు

న్యూఢిల్లీ: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..మార్కెట్లోకి బీఎస్‌-6 ప్రమాణాలతో తయారైన వ్యాగన్‌ ఆర్‌ సీఎన్‌జీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.5.25 లక్షలుగా నిర్ణయించింది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో పది లక్షల గ్రీన్‌ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. దీంట్లోభాగంగా శుక్రవారం సీఎన్‌జీ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు ఎల్‌ఎక్స్‌ఐ మోడల్‌ రూ.5.25 లక్షలకు లభించనుండగా, అదే ఎల్‌ఎక్స్‌ఐ(వో) మోడ ల్‌ రూ.5.32 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారులో 60 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాం క్‌, కిలో సీఎన్‌జీకి 32.52 కిలోమీటర్ల మైలేజ్‌ ఇవ్వనున్నదని మా రుతి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ తెలిపారు. 


logo