సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 15:49:39

అధికారుల సమస్యల పరిష్కారానికి సీఎం కృషి : మంత్రి ఎర్రబెల్లి

అధికారుల సమస్యల పరిష్కారానికి సీఎం కృషి : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ అర్బన్‌ : అధికారుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘాల నేతలు శనివారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘాల డైరీలను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీఓ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ అన్నమనేని జగన్మోహన్‌రావు, ఉమ్మడి జిల్లా టీఎన్జీఓ కోఆర్డినేటర్‌ రాజేశ్‌గౌడ్‌, రాష్ట్ర టీఎన్జీవో నాయ‌కులు శ్యాంసుంద‌ర్‌, రామునాయ‌క్‌, రాంకిష‌న్‌, లక్ష్మణ్‌రావు, ఆయా సంఘాల జిల్లా నాయకులు సోమ‌య్య‌, ర‌త్నాక‌ర్‌రెడ్డి, పుల్లూరు వేణుగోపాల్‌, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, సురేష్‌, సంప‌త్‌, రాజేష్‌, వెంకటేశ్వర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు. అలాగే మంత్రి మ‌ల్లికాంబ మ‌నోవికాస కేంద్రంలోని మాన‌సిక దివ్యాంగులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.