Telangana
- Nov 25, 2020 , 16:10:02
నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్ : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని తన నివాసంలో 17 మంది లబ్ధిదారులకు రూ.6,11,500 సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందన్నారు. పట్టణానికి చెందిన 9 మందికి రూ.4,55,500, సిద్దిపేట రూరల్ మండలంలోని ఒక్కరికి రూ.12,500, చిన్నకోడూరు మండలంలోని ఇద్దరికి రూ.30 వేలు, నంగునూరు మండలంలోని ముగ్గురికి రూ.75,500, నారాయణరావుపేట మండలంలోని ఇద్దరికీ రూ.38,500 చొప్పున చెక్కులను అందజేశారు. చెక్కులను వెంటనే లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాల్లో జమచేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
- గూగుల్ కష్టమర్లకు గుడ్ న్యూస్..!
- బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదమేనా...?
- ఇక సుంకాల మోతే: స్మార్ట్ఫోన్లు యమ కాస్ట్లీ?!
- లైట్..కెమెరా..యాక్షన్..'ఖిలాడి' సెట్స్ లో రవితేజ
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్‌రామ్ పిటిషన్
MOST READ
TRENDING