ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 14:44:12

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్ : మంత్రి హరీశ్‌ రావు

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్ : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట : ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద‌లు సాయం పొందేందుకు సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్దిపేట నియోజకవర్గమే నిదర్శనమన్నారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామ ప్రజాప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.