శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 14:36:37

నిరుపేదలకు కొండంత అండ సీఎంఆర్‌ఎఫ్‌

నిరుపేదలకు కొండంత అండ సీఎంఆర్‌ఎఫ్‌

సిద్దిపేట : ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలోని మంత్రి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద‌లు సాయం పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తున్నదన్నారు. ఇందుకు సిద్దిపేట నియోజకవర్గమే నిదర్శనమని మంత్రి చెప్పారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. 

కొత్త సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ..

జిల్లాలోని ఇతర జిల్లాలకు చెందిన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల ప్రతినిధులు మంత్రి హరీశ్ రావు నివాసంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ క్యాలెండర్లను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. 


వార్డు అభివృద్ధి, పనులు సీసీ రోడ్లకు శంకుస్థాపన..

సిద్దిపేట మున్సిపాలిటీ ప్రత్యేక నిధులు 6.50 కోట్ల రూపాయల్లో భాగంగా 1వ వార్డు నుంచి 9వ వార్డు వరకు.. 9వ పరిధి బాబు జగ్జీవన్ రామ్ సర్కిల్స్ లోని కాలనీల్లో సీసీ రోడ్ల పునరుద్ధరణ- సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్ పాలసాయిరాం, ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా కుల, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


logo