ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 12:45:14

యాదాద్రిలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి పూజలు

యాదాద్రిలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి పూజలు

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మినరసింహా స్వామి వారిని  సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. తుది దశకు చేరుకున్న పనుల పురోగతిపై స్తపతి సలహాదారు ఆనందాచార్యుల వేలు, వైటీడీఏ ఇంచార్జీ ఎస్ఈ వసంత నాయక్, ఆర్కిటెక్ట్ ఆనంద సాయిలను ఆడిగితెలుసుకుంటున్నారు. ఆలయ మాడవీధుల, ప్రధాన ఆలయ, శివాలయం పనులను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈవో గీత, ఉప స్తపతులు తదితరులు ఉన్నారు.