శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 19:46:17

హెచ్‌సీయూకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలి: ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

హెచ్‌సీయూకు పీవీ నరసింహారావు పేరు పెట్టాలి: ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌: పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఇవాళ్టి నుంచి జరుపుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్‌ తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మునుపెన్నడూ లేని విధంగా కుదేలైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను 1991లో సంస్కరణలను చేపట్టి పీవీ నరసింహారావు గాడిలో పెట్టారని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. భరతమాత ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక ఇతర రంగాల్లో సైతం ఆయన విశిష్ట సేవలు అందిచారని, ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

విద్యారంగంలో పీవీ తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మకం. అప్పటి సమైక్య రాష్ట్రంలో ఆయన ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లోని పేద, చురుకైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాయన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలనేది తెలంగాణ ప్రజల డిమాండ్‌ అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 


logo