గురువారం 02 జూలై 2020
Telangana - May 28, 2020 , 18:49:50

మాజీ మంత్రి కే విజయరామారావుకు సీఎం కేసీఆర్‌ పరామర్శ

మాజీ మంత్రి కే విజయరామారావుకు సీఎం కేసీఆర్‌ పరామర్శ

హైదరాబాద్: మాజీ మంత్రి కే విజయరామారావును ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. మూడు రోజుల క్రితం విజయ రామారావు సతీమణి వసుమతి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌  రోడ్‌ నంబర్ 3లోని విజయరామారావు ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్..ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. వసుమతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ వెంట రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్ రెడ్డి  ఉన్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo